ఆధికారి టైటిల్ తో చరణ్, శంకర్ సినిమా..?

 


ఆర్ఆర్ఆర్, ఆచార్య సినిమాల తర్వాత రామ్ చరణ్ చేస్తున్న చిత్రంపై మంచి ఎక్సపెక్టేషన్స్ ఉంటాయనటంలో సందేహం లేదు. డైరెక్టర్ శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్నిదిల్ రాజు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ మూవీ కాన్సెప్ట్‌ పోస్టర్ కోసమే దాదాపు రూ. 2 కోట్ల వరకు ఖర్చు చేసారట. ప్యాన్ ఇండియా లెవల్లో భారీగా నిర్మితమవుతోన్న ఈ సినిమా రూ. 200 కోట్ల బడ్జెట్‌తో వస్తున్నట్లు తెలుస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నారు.


ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికి మూడు షెడ్యూల్ను పూర్తి చేసుకున్న చిత్రటీమ్ ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుంది. అతి త్వరలోనే షూటింగ్ మళ్లీ సెట్స్ పైకి వెళ్లబోతోంది. ఇక ఈ సినిమా కోసం ఒక ఆసక్తికరమైన టైటిల్ ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు "అధికారి" అనే టైటిల్ ను లాక్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీని గురించి అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుందంటున్నారు. అయితే ఇదే టైటిల్ అయితే చాలా ఓల్డ్ గా ఉందంటున్నారు. 


ఇక ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్‌ను ప్రముఖ మీడియా సంస్థ ZEE ఛానెల్ దాదాపు రూ. 150 కోట్ల రూపాయల కి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాకు స్ట్రీమింగ్ భాగస్వామిగా ZEE5 ఓటీటీతో డీల్ కుదర్చుకుందట. ఇక దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో సునీల్, అంజలి, శ్రీకాంత్, నవీన్ చంద్ర కనిపించనున్నారు. 2023 సంక్రాంతి కి ప్రేక్షకుల ముందుకు రానుంది.


అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాలో చరణ్ ఎలక్షన్ కమీషనర్ గా నటించనుండగటంతో పాటు, ఓ మాస్ పాత్రతో ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ వార్తతో శంకర్ సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి అంటున్నారు నెటిజన్స్. ఈ సినిమాలో జ‌యరామ్‌, అంజ‌లి, సునీల్, శ్రీకాంత్‌, న‌వీన్ చంద్ర త‌దిత‌రులు కీలక పాత్రలలో నటిస్తుండగా.. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. 


రామ్ చరణ్ ఆ మధ్యన ఇంటర్వ్యూ లో ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమా వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పుకొచ్చారు . "తెర మీద అయిన సినిమాలు చూసి ఇష్టపడతాం. ఇప్పుడు ఆయనతోనే కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఒక నటుడిగా కంటే ఒక ఫ్యాన్ బాయ్ లాగా నేను సెట్లో ఉండేవాడిని. ప్రతి పాత్రలోనూ స్క్రిప్టు లోనూ ఆయన కనిపిస్తుంటారు. ఆయనతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది" అని రామ్ చరణ్. ఇదిలా ఉంటే.. మరోవైపు రామ్ చరణ్.. ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.