జమ్మూకశ్మీర్ లోని లద్దాఖ్లో ఘోర ప్రమాదం.అదుపుతప్పి నదిలో పడిపోయిన జవాన్లతో వెళ్తున్న బస్సు.

 


జమ్మూకశ్మీర్ లోని లద్దాఖ్లో  ఘోర ప్రమాదం జరిగింది. 26 మంది జవాన్లతో వెళ్తున్న బస్సు.. అదుపుతప్పి నదిలో పడిపోయింది. తుర్తుక్ సెక్టార్ వద్ద ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు సైనికులు ప్రాణాలు కోల్పాయారు. మరికొందరికి తీవ్రగాయాలయ్యాయి. చికిత్స కోసం వారిని పార్తాపూర్‌లోని 403 ఫీల్డ్ హాస్పిటల్‌కు తరలించారు. వాహనం దాదాపు 50-60 అడుగుల లోతులో పడిపోయింది. 26 మంది సైనికులతో కూడిన బృందం పార్తాపూర్‌లోని ట్రాన్సిట్ క్యాంప్ నుంచి సబ్ సెక్టార్ హనీఫ్‌ కు వెళ్తోంది. బస్సు వెళ్తున్న సమయంలో ప్రమాదవశాత్తు అదుపుతప్పి రోడ్డుపై నుండి జారి షియోక్ నదిలో పడిపోయింది. దీంతో ఈ ఘోరం జరిగినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. గాయపడిన వారికి అత్యుత్తమ వైద్య సంరక్షణ అందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరింత తీవ్రమైన ప్రాణనష్టాలను నివారించేందుకు వైమానిక దళం సహాయం కోరామని ఆర్మీ అధికారులు తెలిపారు.