ప్రశాంత్ నీల్ తో మరో టాలీవుడ్ క్రేజీ హీరో...?

 


చిన్న హీరోగా కెరీర్‌ మొదలు పెట్టి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు న్యాచురల్‌ స్టార్‌ నాని. సినిమా సినిమాకు తనలోని వేరియేషన్‌ను మారుస్తూ టాలీవుడ్‌ అగ్ర హీరోల్లో ఒకరిగా మారాడు నాని. ఇక నాని ఎంచుకునే సినిమా కథాంశాలు కూడా విభిన్నంగా ఉంటాయి. తాజాగా ‘శ్యామ్‌ సింగరాయ్‌’తో మంచి హిట్‌ను అందుకున్న నాని ప్రస్తుతం ‘అంటే సుందరానికి’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో పాటు ‘దసరా’ అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా నాని తర్వాతి చిత్రంపై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్‌ వైరల్‌ అవుతోంది.


నాని తర్వాతి చిత్రం ఓ పాన్‌ ఇండియా డైరెక్టర్‌తో చేయనున్నాడనేది సదరు వార్త సారంశం. ఇంతకీ ఆ డైరెక్టర్‌ మరెవరో కాదు. కేజీఎఫ్‌ అనే సినిమాతో యావత్‌ ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీని తనవైపు తప్పుకున్న ప్రశాంత్‌ నీల్‌. అవును ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోన్న వార్త ఇదే. ఈ సినిమాను కూడా హోంబలే ప్రొడక్షన్‌ హౌజ్‌ నిర్మించనుంది అన్న చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ప్రశాంత్‌ నీల్‌ సలార్‌ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా పూర్తికాగానే ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేయనున్నాడు. ఆ సినిమా తర్వాత నానితో కొత్త సినిమా అనౌన్స్‌మెంట్ ఉంటుందని ఓ చర్చ జరుగుతోంది.