మాజీ మంత్రి నారాయణకు బెయిల్‌ మంజూరు .

 


మాజీ మంత్రి నారాయణకు బెయిల్‌ మంజూరు అయింది. వ్యక్తిగత పూచీకత్తుతో న్యాయమూర్తి సులోచనా రాణి బెయిల్‌ మంజూరు చేశారు. టెన్త్‌ క్లాస్‌ ప్రశ్నప్రతాల లీక్‌ కేసులో చిత్తూరు జిల్లా పోలీసులు నారాయణను హైదరాబాద్‌ లో నిన్న అరెస్టు చేసి..

చిత్తూరుకు తరలించారు. అయితే.. తాజాగా లక్ష రూపాయాల పూచీకత్తుతో మాజీ మంత్రి నారాయణకు బెయిల్‌ మంజూరు చేశారు. దీంతో ఇవాళ నారాయణ రిలీజ్‌కానున్నారు.

కాగా.. మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కు లేఖ రాశారు టీడీపీ అధినేత చంద్రబాబు. నారాయణ అరెస్ట్ రాజకీయ కక్షతో జరిగిందని లేఖలో పేర్కొన్న చంద్రబాబు.. హైదరాబాద్ నుంచి చిత్తూరు తరలింపులో జాప్యం వెనుక దురుద్దేశ్యం ఉందని ఫైర్‌ అయ్యారు. రఘురామ కృష్ణంరాజు అరెస్ట్ సమయం జరిగిన ఉదంతాన్ని లేఖలో ప్రస్తావించిన చంద్రబాబు… నారాయణను పోలీసు కస్టడీలో ఉంచే ప్రయత్నంపై ఆందోళన వ్యక్తం చేశారు. పేపర్ లీకేజీ కేసులో అదనపు సెక్షన్లు జోడించి అక్రమ అరెస్టపకు పాల్పడ్డారని లేఖరాశారు చంద్రబాబు.