సాగు చట్టాలను ఎత్తివేయాలంటూ సాగిన ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన అన్నదాతల కుటుంబాలకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు ఆర్ధిక సాయం.

 


సాగు చట్టాలను ఎత్తివేయాలంటూ సాగిన ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన అన్నదాతల కుటుంబాలకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు ఆర్ధిక సాయం చేశారు. చండీఘడ్ ఠాగూర్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఆరు వందల రైతు కుటుంబాల్లో ఒక్కో కుటుంబానికి మూడు లక్షల రూపాయల చొప్పున చెక్కులు అందించారు. కార్యక్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, రైతు ఉద్యమ నాయకుడు తికాయత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన సీఎం కేసీఆర్ రైతులకు తాము ఎప్పుడూ అండగా ఉంటామన్నారు. గల్వాన్ లోయలో చైనాతో జరిగిన ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కుటుంబాలను కూడా కేసీఆర్ పరామర్శించారు. 


తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడక ముందు రైతులు పెద్ద సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకునేవారని, ప్రస్తుతం పరిస్ధితులు మెరుగుపడ్డాయని, తాము రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని కేసీఆర్ చెప్పారు. కేంద్రం కరెంట్ మోటార్లకు మీటర్లు పెట్టాలనే కొత్త నిబంధన తెచ్చిందని, ప్రాణాలు పోయినా మీటర్లు బిగించబోమని కేసీఆర్ స్పష్టం చేశారు