మహేశ్‌,త్రివిక్రమ్‌ సినిమా నుండి బిగ్ అప్డేట్...?

 


మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌  దర్శకత్వంలో నటించనున్నాడు మహేశ్‌. SSMB 28 అనే వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందే ఈ ప్రాజెక్ట్‌ ప్రస్తుతం ప్రీప్రొడక్షన్‌ పనులను జరుపుకుంటుంది. పూజాహెగ్డే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించనున్నట్లు తెలుస్తోంది. జులైలో రెగ్యులర్ షూటింగ్‌ ప్రారంభించనున్నట్లు సమాచారం. కాగా మహేశ్‌-త్రివిక్రమ్‌ల సినిమాలకు సంబంధించి ఓ ఆసక్తికర అప్‌డేట్‌ నెట్టింట చక్కర్లు కొడుతోంది.


అదేంటంటే.. ఈ సినిమాలో ఓ తెలుగు స్టార్‌ హీరో అతిథి పాత్రలో కనిపించనున్నాడట. ఆయన మరెవరో కాదు న్యాచురల్‌ స్టార్‌ నాని. ఈ సినిమాలో ముఖ్యపాత్ర కోసం నానిని సంప్రదించినట్లు టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై చిత్రబృందం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరి దీనిపై రావాలంటే ఈ మూవీ సెట్‌పైకి వచ్చేవరకు వేచి చూడాల్సిందే. కాగా ఈ మొదట క్యామియో రోల్‌ కోసం నితిన్‌, శర్వానంద్‌లను సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. కాగా మహేశ్‌-త్రివిక్రమ్‌ల సినిమా రావడం ఇది మూడోసారి. గతంలో వీరిద్దరి కలయికలో అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి.