సలార్ సినిమా టీజర్ రిలీజ్ కు డేట్ ఫిక్స్..?

 


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న చిత్రం సలార్ . ఇటీవలే కేజీఎఫ్ 2 సినిమాతో సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్… ప్రభాస్ తో (Prabhas) చేస్తోన్న ఈ మూవీ చేస్తుండడంతో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఇందులో ప్రభాస్ సరసన శ్రుతి హాసన్ .. ఆద్య పాత్రలో కనిపించనుంది. ఈ మూవీ గురించి గత కొద్ది రోజులుగా ప్రతి చిన్న అప్డేట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి టీజర్ మే నెలలో రాబోతుందని మేకర్స్ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో సలార్ టీజర్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సలార్ ప్రొడ్యూసర్ విజయ్ కిరంగదుర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారాయి.. ముందుగా ప్రకటించినట్టు మే నెలలో టీజర్ విడుదల చేయలేకపోతున్నామంటూ అసలు విషయం చెప్పి షాకిచ్చారు.


హోంబలే ఫిలింస్ కు చెందిన విజయ్ కిరంగదుర్ మాట్లాడుతూ.. ” మేము సలార్ సినిమా కోసం భారీస్తాయిలో టార్గెట్స్ సెట్ చేశాము.. ఓవైపు ఇండియాస్ నంబర్ వన్ మూవీ బాహుబలి 2 లో హీరోగా నటించి పాన్ ఇండియా స్టార్ గా నిలిచిన ప్రభాస్.. మరోవైపు ఇండియాలోనే సెకండ్ బిగ్గెస్ట్ ఫిల్మ్ కేజీఎఫ్ 2 తెరకెక్కించిన ప్రశాంత్ నీల్.. వీరిద్దరి కలయికలో సినిమా రావడం పెద్ద సవాలుగా మారనుంది. ఈ కలయిక సంచలనం సృష్టించబోతుంది. ఇందుకోసం మేము భారీ స్తాయిలో సినిమా తెరకెక్కిస్తున్నాం.. ఫ్యాన్స్ అంచనాలను అందుకునేందుకు ప్రయత్నిస్తున్నాము.. సలార్ సినిమా ఘన విజయం సాధిస్తుంది.. అలాగే.. మేము మే నెలలో టీజర్ విడుదల చేయబోతున్నట్లు ప్రకటించాం.. కానీ ఇప్పుడు ప్లాన్ మారింది. టీజర్ విడుదలకు త్వరలోనే ఓ తేదీని ప్రకటిస్తాము.. ” అంటూ చెప్పుకొచ్చారు.