తెలంగాణ రాష్ట్రంలో స్వతంత్య్ర సమరయోధులకు న్యాయం చేయండి కెటిఆర్ సారు- స్వాతంత్య్ర సమరయోధుడి సతీమణి కోవూరి మాణెమ్మ.  •  స్వతంత్య్ర సమరయోధులకు న్యాయం జరిగేది ఎపుడు?- తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి న్యాయవాది కోవూరి సత్యనారాయణగౌడ్.


హైదరాబాద్ : కిమ్స్ కొండాపూర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న స్వాతంత్య్ర సమరయోధుడి సతీమణి కోవూరి మాణెమ్మ మాట్లాడుతూ భారత దేశ స్వాతంత్య్రోద్యమంలో తెలంగాణ రాష్ట్రంలో కీలక పాత్ర వహించిన స్వతంత్య్ర సమరయోధులకు సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణానికి చెందిన దాదాపు నలభై రెండు కుటుంబాలకు పది ఎకరాల భూమిని కేటాయించడం జరిగిందిని తెలిపారు. అందులో భాగంగా స్వతంత్య్ర సమరయోధుడు కీర్తిశేషులు కోవూరి మొగులయ్యగౌడ్ సతీమణి కోవూరి మణెమ్మ గారి కుటుంబానికి పదెకరాల భూమి కేటాయించారని అట్టి భూమి పట్టా సర్టిఫికెట్ పత్రాలు పురాతన ఇల్లు శిథిలావస్థకు చెంది కూలిపోవడంతో తనకు ఇచ్చిన పదెకరాల భూమి సర్టిఫికెట్ పత్రాలు కనుమరుగైపోవటంతో తన భర్త స్వాతంత్య్ర సమరయోధుడు కీర్తిశేషులు కోవూరి మొగులయ్యగౌడ్ గారు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన సర్టిఫైడ్ పది ఎకరాల పట్టా సర్టిఫికెట్లు పొందుటకు ప్రయత్నించి కార్యాలయాల చుట్టూ తిరిగి మనస్తాపానికి గురై 1999 లో మరణించారని తెలియజేశారు. తిరిగి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక పది ఎకరాల భూమి సర్టిఫికెట్లు జారీ చేయమని , పదెకరాల భూమిని కేటాయించామని తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వ యంత్రాంగాన్ని సంప్రదిస్తూ ఇట్టి విషయాన్ని ఢిల్లీ కేంద్ర మంత్రుల దృష్టికి మరియు కేంద్రం ప్రభుత్వం వరకు తీసుకెళ్లగా కేంద్ర ప్రభుత్వ మంత్రులు మరియు కేంద్ర ప్రభుత్వం స్వాతంత్య్ర సమరయోధుడు కీర్తిశేషులు కోవూరి మొగులయ్యగౌడ్ కుటుంబానికి జారీ చేసిన పదెకరాల భూమి సర్టిఫికెట్లు ఇచ్చి భూమి కబ్జా ఇప్పించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సెక్రటరీ గారికి ఆదేశాలు జారీ చేశారు.తదనంతరం ఉమ్మడి మెదక్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తోన్న మంత్రి హరీష్ రావు గారు న్యాయం చేస్తానని ఎండార్స్మెంట్ చేయగా మరియు ప్రత్యేకంగా రెండోసారి న్యాయం చేయమని లిఖితపూర్వకంగా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు గారికి తెలుపగా ఇట్టి విషయంలో సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ యంత్రాంగం మరియు జిల్లా కలెక్టర్ హనుమంతరావు గారు నిర్లక్ష్యం వహిస్తూ వ్యవహరిస్తున్నారని తెలియజేశారు. ఇట్టి విషయంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మంత్రి వర్యులు కెటిఆర్ ప్రతి నిత్యం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమక్షంలో తెలంగాణ ప్రజలకు కాపలా కుక్కలాగా ఉన్నామని, తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోరుతున్నామని, తెలంగాణ రాష్ట్ర ప్రజల అభివృద్ధే తమ లక్ష్యమని, తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యలను పరిష్కరించడమే టీఆర్ఎస్ పార్టీ విధి విధానమని తెలియజేస్తున్నారని తెలుపుతూ అందులో భాగంగా డెబ్బై అయిదు సంవత్సరాలు గడిచినా స్వతంత్య్ర సమరయోధులకు తెలంగాణ సాధించుకున్నాక కూడా పదెకరాల భూమి సర్టిఫైడ్ సర్టిఫికెట్లు జారీ చేయకుండా న్యాయం చేయకుండా, కబ్జా ఇప్పించకుండా సంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం వహించడం మరియు సంబంధిత టీఆర్ఎస్ పార్టీ సంగారెడ్డిజిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అసమర్థుడిగా వ్యవహరించడం సిగ్గు చేటు అని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి న్యాయవాది కోవూరి సత్యనారాయణగౌడ్ తెలియజేశారు.అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని స్వతంత్య్ర సమరయోధుడు కీర్తిశేషులు కోవూరి మొగులయ్యగౌడ్ సతీమణి కోవూరి మాణెమ్మ కుటుంబానికి పది ఎకరాల ప్రభుత్వ భూమి సర్టిఫైడ్ కాపీలు జారీచేసి కబ్జా ఇప్పించగలరని విజ్ఞప్తి చేశారు. కీమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న స్వాతంత్య్ర సమరయోధుడి సతీమణిని పరామర్శించిన పలువురు సంఘ సంస్కర్తలు మరియు స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాలు.