శ్రీలంకకు బాసటగా నిలుస్తున్న భారత్..

 


 సంక్షోభం గుప్పిట చిక్కిన శ్రీలంకకు భారత్‌ బాసటగా నిలుస్తోంది. శ్రీలంకతో మనకు ఎంతో చారిత్రక బంధం ఉంది.

అందులోనూ మన పొరుగు దేశం శ్రీలంక. అలాంటి లంక ఇప్పుడు కష్టాల్లో ఉంది. అందుకే.. ఇండియా శ్రీలంకను ఆదుకునేందుకు ముందుకొచ్చింది. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకకు కేవలం ఈ ఏడాది ఇప్పటి వరకు మూడున్నర బిలియన్‌ డాలర్ల ఆర్థిక సాయం చేసింది. ప్రజాస్వామ్యం, సుస్థిరత సహా ఆర్థికంగా కోలుకోవడానికి భారత్‌ పూర్తిగా మద్దతు ఇస్తుందని విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్‌ బాగ్చీ తెలిపారు. ప్రజాస్వామ్య పద్ధతిలో శ్రీలంక ప్రజల ప్రయోజనాలను భారత్‌ ఎప్పుడూ కాపాడుతుందని బాగ్చీ తెలిపారు. ప్రభుత్వం తరపనే కాదు.. అనేక భారత ఎన్జీవో సంస్థలు శ్రీలంకకు నేరుగా సాయం చేస్తున్నాయి. ఆహారం, ఔషధాలు వంటి నిత్యావసర వస్తువులను అందిస్తున్నాయి.