నయన తార తో ఎంఎస్‌ ధోనీ సినిమా..?

 భారత మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ మూవీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. అయితే నటుడిగా కాదు.. నిర్మాణ రంగంలోకి వస్తున్నాడు. ఆయన త్వరలోనే నిర్మాతగా కోలీవుడ్ లోకి అడుగు పెట్టుబోతున్నాడని తెలుస్తోంది.
ఎంఎస్ ధోనీ తన మొదటి కోలీవుడ్‌ ప్రాజెక్ట్ కోసం సూపర్ స్టార్ రజనీకాంత్ సన్నిహితుడు సంజయ్‌ని ఎంచుకున్నారట. మహీ తొలి చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటిస్తుందని తెలుస్తోంది. ఈ నెలాఖరున ఈ చిత్రం నిర్మాణం ప్రారంభం కానుందట. ఐపీఎల్ 2022 ముగిసిన వెంటనే దీనిపై ధోనీ అధికార ప్రకటన చేస్తారని సమాచారం.


ధోనీ ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ద్వారా తమిళ అభిమాన గణాన్ని పెంచుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా ద్వారా ఆ అభిమాన బలగాన్ని మరింత పెంచుకునేందుకు సిద్ధమైపోయాడు.