రేపే నాని అంటే.. సుందరానికీ..’ సినిమా ట్రైలర్ విడుదల..

 


నేచురల్ స్టార్ నానీ,  మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ జంటగా.. వివేక్ ఆత్రేయ  దర్శకత్వంలో తెరకెక్కుతోన్న కామెడీ ఎంటర్ టైనర్ ‘అంటే.. సుందరానికీ..’  మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మాణం జరుపుకుంటున్న ఈ సినిమా నానీ కెరీర్ లో 28వ చిత్రంగా విశేషాన్ని సంతరించుకుంది. బ్రహ్మణ యువకునిగా నానీ, క్రిస్టియన్ అమ్మాయిగా నజ్రియా నటించిన ఈ సినిమా.. వీరిద్దరి ప్రేమకథ, దాని వల్ల జరిగే పరిణామాల నేపథ్యంలో హిలేరియస్ కామెడీని అందించబోతోంది. ఇందులో నానీకి ఒక చెప్పుకోలేని బలహీనత ఉంటుంది. అదేంటి అనేది మేకర్స్ ఎక్కడా రివీల్ చేయలేదు. అదే ఈ సినిమాకి హైలైట్ కానున్నదని సమాచారం. ఇది వరకు విడుదలైన ఈ సినిమా టీజర్, సింగిల్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని జూన్ 10న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నారు. దీనికి ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు.


ఈ నెల 30న అంటే రేపే ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. రేపు ఉదయం 11 గంటల 7 నిమిషాలకు ట్రైలర్ విడుదల కానుంది. ఈ సందర్భంగా ఓ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. హీరో నానీ, హీరోయిన్ నజ్రియా ఈ సినిమా ట్రైలర్ అప్టేట్ బోర్డ్స్‌తో రివీలవడం ఆకట్టుకుంటోంది. నానీ కెరీర్ లో ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న ‘అంటే సుందరానికీ’ చిత్రం అతడికి మంచి మైలేజ్ ను ఇస్తుందని మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు. ఈ సినిమాతో మొట్టమొదటి సారిగా తెలుగులో కథానాయికగా పరిచయమవుతోంది నజ్రియా నజీమ్. ఈ సినిమా కానీ మంచి సక్సెస్ అయితే.. ఆమెకి తెలుగులో మరిన్ని మంచి అవకాశాలు వస్తాయని చెప్పొచ్చు. మరి ఈ సినిమా నానీకి ఏ స్థాయిలో సక్సెస్ అందిస్తుందో చూడాలి.