బాలయ్య ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్డేట్..

 


తెలుగు ప్రజల ఆరాధ్యనటుడు,దివంగత ఎన్టీఆర్ జయంతి నేడు. ఆయన శత జయంతి ఉత్సవాలను తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహిస్తుండగా బాలయ్య ఫ్యాన్స్‌కు అదిరిపోయే కిక్ ఇచ్చారు దర్శకుడు గోపిచంద్ మలినేని.

బాలయ్య- గోపిచంద్ దర్శకత్వంలో NBK 107 తెరకెక్కుతుండగా ఈ సినిమాకు సంబంధించి స్పెషల్ పోస్టర్‌ని రిలీజ్ చేశారు. కత్తి పట్టుకుని బాలయ్య మాస్ అవతార్‌లో కనిపిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జై బాలయ్య అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో కనిపించబోతున్నారు. శ్రుతీ హాసన్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేయనున్నారు బాలయ్య.