మహేశ్ బాబు సినిమా లో కీలక పాత్ర లో నందమూరి తారకరత్న..

 

సూపర్ స్టార్ మహేశ్ బాబు  హీరోగా తెరకెక్కబోతున్న లేటెస్ట్ మూవీలో నందమూరి హీరో నటించబోతున్నాడనే ఓ తాజా వార్త ప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇటీవలే సర్కారు వారి పాట సినిమాతో వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్నారు మహేశ్. ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా కోసం రెడీ అవుతున్నారు. SSMB 28 అనే వర్కింగ్ టైటిల్‌తో, ఫిబ్రవరిలో గ్రాండ్‌గా లాంచ్ చేశారు. జూన్ నుంచి సెట్స్ మీదకు తీసువచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. పూజా హెగ్డే  హీరోయిన్‌గా నటించబోతున్న ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. 


అయితే, ఈ మూవీలో ఓ కీలక పాత్ర ఉండగా, దానికోసం


నందమూరి తారకరత్న ను తీసుకునేందుకు త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నట్టు తాజా సమాచారం. ఆయన తీసే సినిమాలలో సీనియర్ ఆర్టిస్టులను ఎక్కువగా నటింపజేస్తున్న సంగతి తెలిసిందే. అత్తారింటికి దారేది సినిమాలో నదియా, అజ్ఞాతవాసి సినిమాలో ఖుష్బూ, అల వైకుంఠపురములో సినిమాతో టబును తీసుకొచ్చారు. అంతేకాదు, కొందరు ఫేడౌవుట్ హీరోలకు మంచి పాత్రలు ఇచ్చి తెరపైకి తీసుకొస్తున్నారు.