తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్..

 


తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెల కూడా నిరాశే మిగిలింది. తెలంగాణ లోని 8 జిల్లాల ప్రభుత్వ ఉద్యోగులకు ఏప్రిల్‌ నెల జీతాలు ఇంకా జమ కాలేదు. మే నెల ప్రారంభమై 10 రోజులు గడిచినా… జీతాలు అందకపోవడంతో..

ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం వెంటనే స్పందించి తమ జీతాలు త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఉద్యోగులు. ప్రతి నెలా జీతాల కోసం ఉద్యోగులు ఇలా వెయిట్‌ చేయాల్సి వస్తోంది. ఏ జిల్లా ఉద్యోగులకు జీతాలెప్పుడు వస్తాయేనని మేం చర్చించుకునేలా పరిస్థితి తయారైంది.

జీతాలు సకాలంలో రాకపోవడంతో బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలకు గడువులోగా ఈఎంఐలు చెల్లించలేకపోతున్నామని.. దీంతో బ్యాంకులు పెనాల్టీలు వేసి సొమ్ము చేసుకుంటున్నాయని కొందరరు ఉద్యోగులు వాపోతున్నారు. తెలంగాణలోని 33 జిల్లాల్లో 25 జిల్లాల ఉద్యోగులకు మాత్రమే ఏప్రిల్‌వేతనాలు చెల్లించారు. ఇంకా 8 జిల్లాల వారికి చెల్లించాల్సి ఉంది.