హైదరాబాద్‌లో మరోసారి పెద్దమొత్తంలో పట్టుబడ్డ గంజాయి..

 


హైదరాబాద్‌లో మరోసారి పెద్దమొత్తంలో గంజాయి పట్టుబడింది. నగర శివార్లలోని హయత్‌నగర్‌ పోలీస్‌స్టేన్‌ పరిధిలో ఉన్న పెద్ద అంబర్‌పేట ఓఆర్‌ఆర్‌ వద్ద ఎస్‌వోటీ పోలీసులు గంజాయిని పట్టుకున్నారు.

ఓఆర్‌ఆర్‌ వద్ద ఓ కంటెయినర్‌ను తనిఖీ చేయగా అందులో భారీగా గంజాయిని గుర్తించారు. మొత్తం 370 కిలోల మత్తుమందును సీజ్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.