ఎట్టకేలకు వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారయ్యారు.

 


ఎట్టకేలకు వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారయ్యారు! 

మంగళవారం కర్నూలు జిల్లా పర్యటన ముగించుకుని రాగానే... ముఖ్యమంత్రి జగన్‌ వైసీపీ రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక పూర్తి చేశారు. ప్రముఖ బీసీ నాయకుడు ఆర్‌.కృష్ణయ్య, మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌ రావు, ఏలేటి నిరంజన్‌ రెడ్డిలకు రాజ్యసభ చాన్స్‌ ఇచ్చారు. ఇప్పటికే రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయ సాయిరెడ్డిని మరోసారి పెద్దల సభలో కొనసాగించాలని నిర్ణయించారు. నలుగురిలో 


ఇద్దరు బీసీలు కాగా... మిగిలిన ఇద్దరు జగన్‌ సొంత సామాజిక వర్గానికి చెందిన వారు. ఆర్‌.కృష్ణయ్య, బీద మస్తాన్‌ రావు ఇద్దరూ గతంలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేలుగా నెగ్గిన వారే కావడం విశేషం. 2014లో ఆర్‌.కృష్ణయ్య ఎల్‌బీనగర్‌ నుంచి తెలంగాణ శాసన సభకు ఎన్నికయ్యారు. అప్పట్లో ఆయనను చంద్రబాబు నాయుడు ‘ముఖ్యమంత్రి అభ్యర్థి’గా కూడా ప్రకటించారు. ఇక... బీద మస్తాన్‌ రావు కావలి నుంచి 2009లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ కండువా కప్పుకొన్నారు.