"హరి హర వీర మల్లు" సినిమా విడుదల తేదీ లాక్ ..?

 

క్రిష్ దర్శకత్వం


లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ "హరి హర వీర మల్లు" సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసందే. ఈ చిత్రం పీరియాడిక్ యాక్షన్ డ్రామా ట్రాక్ లో భారీ స్థాయిలో మౌంట్ చేయబడుతోంది.


ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, 'హరి హర వీర మల్లు' నిర్మాతలు ఈ సినిమా టెంపరరీ విడుదల తేదీని లాక్ చేసినట్లు టాక్. ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా వచ్చే సంక్రాంతి సీజన్‌లో థియేట్రికల్ విడుదల కానుంది అని సమాచారం. మరికొద్ది రోజుల్లో మూవీ మేకర్స్ ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటించనున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. 'హరిహరవీరమల్లు' సినిమాలో సిజ్లింగ్ బ్యూటీ నోరా ఫతేహి షాజహాన్ మూడవ కుమార్తె మరియు ఔరంగజేబ్ సోదరి రోషనరా బేగం పాత్రలో కనిపించనున్నది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో నటించనున్నారు. ఈ పాన్-ఇండియా మూవీని మెగా సూర్య ప్రొడక్షన్ నిర్మిస్తుండగా, ఎంఎం కీరవాణి సంగీతం అందించారు