మళ్లీ పెరిగిన వంటగ్యాస్ ధరలు..

 


దేశంలో వంటగ్యాస్ ధర గురువారం మరోసారి పెరిగింది. గ్యాస్ సిలిండర్ ధర వెయ్యిరూపాయల మార్కు దాటింది.దేశీయ వంటగ్యాస్ ఎల్‌పీజీ ధర గురువారం సిలిండర్‌కు రూ.3.50 చొప్పున పెంచారు. ఈ నెలలో గ్యాస్ రేట్లు రెండవసారి పెంచారు.రాష్ట్ర ఇంధన రిటైలర్ల ధర నోటిఫికేషన్ ప్రకారం సబ్సిడీ లేని ఎల్పీజీ ఇప్పుడు దేశ రాజధానిలో 14.2కిలోల సిలిండర్‌ ధర 1,003కు పెరిగింది.మే 7వతేదీన సిలిండర్‌కు 50 రూపాయలు పెంచారు. అంతకు ముందు మార్చి 22వతేదీ కూడా అదే మొత్తంలో ధరలు పెరిగాయి.వాణిజ్య సిలిండర్ ధర రూ.8 పెరిగింది. వంటగ్యాస్ ధర పెంపుతో సామాన్యులపై అదనపు భారం పడుతోంది.