ఏపీ లో మత్స్యకార భరోసా కార్యక్రమం వాయిదా..

 


అసని తీవ్ర తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా ఏపీలో ఈరోజు ప్రభుత్వం తలపెట్టిన వైఎస్ఆర్ మత్స్యకార భరోసా కార్యక్రమం వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం బుధవారం నాడు కోనసీమ జిల్లా మురమళ్ల గ్రామంలో మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉంది.

అయితే తుఫాన్ కారణంగా ఈరోజు నిర్వహించాల్సిన కార్యక్రమాన్ని అధికారులు ఈ నెల 13వ తేదీకి వాయిదా వేశారు. దీంతో లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులను శుక్రవారం రోజే జమ చేయనున్నారు.

కాగా గురువారం నాడు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు అమరావతి సచివాలయం మొదటి బ్లాకులో సీఎం జగన్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ అన్ని శాఖల కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ నెల 13న ఉ.11 గంటలకు కేబినెట్ భేటీ జరగాల్సి ఉంది. అయితే అనివార్య కారణాలతో మంత్రివర్గ సమావేశాన్ని ఒకరోజు ముందుగానే అంటే 12వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు మార్చారు