ఆంధ్ర ప్రదేశ్ అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి కార్యాలయంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్.

 ఆంధ్రప్రదేశ్ సచివాలయం: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కార్యాలయంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు కార్య నిర్వహణలో భాగంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారి రాజ్యసభ సభ్యుడిగా నియామకం గౌరవనీయులు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకుకాగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులలో మరింత శక్తిని నెలకొల్పి ఆర్ కృష్ణయ్య గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో నలుమూలల పలు న్యాయ పూరితమైన ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఎప్పుడూ ముందుంటుందని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ పేదరికంతో అలమటిస్తున్నటువంటి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు భరోసా ఇచ్చారు. ఆర్ కృష్ణయ్య గారి బాటలో తమ్ముడిలా ముందుకు నడుస్తున్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ గారు కార్యాచరణలో భాగంగా మాట్లాడుతూ సమయం చాలా విలువైందని అట్టి సమయాన్ని మరింత శరవేగంగా ప్రజా సమస్యల పరిష్కార సాధనలో ప్రతి ఒక్క జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు నడుం బిగించి వెనకడుగు వేయకుండా ముందుండాలని ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని అట్టి సమస్యలను విశ్లేషణాత్మకంగా పరిష్కరించడానికి రాజ్యసభ సభ్యునిగా నియామకమైన ఆర్ కృష్ణయ్య గారి నేతృత్వంలో ఎప్పుడు ముందుంటామని పిలుపునిచ్చారు. ఈ యొక్క చర్చాంశామైనా సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు లాల్ కృష్ణ గారు, గుజ్జ సత్యం గారు, బిసి రక్షకదల్ చైర్మన్ ఉదయ్ కుమార్ గారు, దాసు సురేష్ గారు మరియు అధిక సంఖ్యలో బీసీ నాయకులు పాల్గొన్నారు.