ప్రభాస్ కు జోడీగా అనుష్క..?

 


అందాల అనుష్క స్క్రీన్ పై కనిపించి చాలా కాలం అవుతుంది.. చివరిగా నిశ్శబ్దం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు అనుష్క. ఈ సినిమా ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దాంతో అనుష్క అభిమానులు ఓ సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న అనుష్క.. ఆతర్వాత భాగమతి సినిమాతో అలరించారు. ఆతర్వాత నిశ్శబ్దం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఇప్పుడు నవీన్ పోలిశెట్టి హీరోగా తెరకెక్కుతోన్న సినిమాలో అనుష్క నటిస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుందని అంటున్నారు. ఇదిలా ఉంటే అనుష్క ఇప్పుడు ప్రభాస్ కు జోడీగా నటించనున్నారని టాక్ వినిపిస్తుంది.


ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్న ప్రభాస్ .. మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు రాజా డీలక్స్ అనే టైటిల్ ను అనుకుంటున్నారు. ఈ సినిమాలో అనుష్క నటిస్తున్నారని.. దర్శకుడు మారుతి ఆమెను ఒప్పించినట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది. రాజా డీలక్స్ సినిమాలో హీరోయిన్ గా అనుష్క అయితే ఈ ప్రాజెక్టుకు మరింత ప్లస్ అవుతుందని భావించిన మారుతి అనుష్క ను సంప్రదించారని తెలుస్తుంది. ప్రభాస్ సరసన సినిమాఅనగానే అనుష్క వెంటనే ఓకే అన్నారని తెలుస్తుంది. ఈ సినిమా మారుతి మార్క్ లో హారర్ కామెడీ అని మొదటి నుంచి వినిపిస్తున్న టాక్.