ఎస్బిఐ కస్టమర్లకు మరో కీలక హెచ్చరిక..

 


స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్లకు అలర్ట్‌. మీ ఎస్‌బీఐ ఖాతా బ్లాక్‌ చేశారని మరో ఫేక్‌ మెసేజ్‌ తాజాగా సర్య్యూలేట్‌ అవుతోంది.



దీని పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ నకిలీ ఎస్‌ఎంఎస్‌లు, ఈమెయిల్‌లకు ఎట్టిపరిస్థితుల్లోనూ స్పందించవద్దని సూచించింది. ఈ మేరకు వ్యక్తిగత, బ్యాంకింగ్‌ వివరాలను పంచుకోవద్దని వెల్లడించింది. ఒకవేళ అటువంటి సందేశాలు మీకు వస్తే report.phishing@sbi.co.inకు నివేదించాలని కోరింది. ఈ మేరకు పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌ తన అధికారిక ట్విటర్‌ హ్యాండిల్‌లో ఈ హెచ్చరికను షేర్‌ చేసింది.


అయితే, ఎస్‌బీఐ బ్యాకింగ్‌కు సంబంధించి ఫేక్‌ మెసేజ్‌లు సర్క్యూలేట్‌ కావడం ఇదే మొదటిసారి కాదు. ఈ ఏడాది మార్చిలోనూ చాలా మంది ఎస్‌బీఐ కస్టమర్లకు.. KYC నిబంధనలను పాటించనందుకు తమ ఖాతాను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు మెసేజ్‌లు వచ్చాయి. ఇందుకు సంబంధించి ఓ లింక్‌ ఇచ్చి KYCని అప్‌డేట్‌ చేయమని కేటుగాళ్లు కోరారు. ఈ నేపథ్యంలోనే ఖాతాదారులెవరూ నకిలీ సందేశాలతో వచ్చే లింక్‌లపై క్లిక్‌ చేయవద్దని ఎస్‌బీఐ అప్రమత్తం చేసంది.