మోడీ పాలనా రాహుల్ గాంధీ ఫైర్..

 


గ్యాస్ సిలిండర్ ధరను నరేంద్ర మోడీ ప్రభుత్వం భారీగా పెంచిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు.

తమ హయంలో కంటే ప్రస్తుత బీజేపీ పాలనలో ఇంధన ధరలు రెండింతలు పెరిగాయన్నారు. ప్రస్తుతం ఒక సిలిండర్ వంట గ్యాస్ ధరకు 2014లో రెండు సిలిండర్లు వచ్చేవని గుర్తు చేస్తూ మోడీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే పేదలు, మధ్య తరగతి కుటుంబాల సంక్షేమం కోసం కృషి చేస్తుందని రాహుల్ గాంధీ అన్నారు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు మోత మోగిస్తుండగా తాజాగా ఎల్ పీజీ సిలిండర్ ధరను పెంచడంపై చమురు సంస్థలు దృష్టి పెట్టాయి. శనివారం (ఈనెల 7వ తేదీన ) ఒక సిలిండర్ ధర రూ.50 పెరిగింది. గడిచిన ఆరు వారాల్లో గ్యాస్ సిలిండర్ ధర పెరగడం ఇది రెండోసారి. దీంతో దేశ వ్యాప్తంగా చాలా నగరాల్లో 14.2 కిలోల సిలిండర్ వంట గ్యాస్ ధర వెయ్యికి చేరువైంది. హైదరాబాద్ లో రూ.1052కి చేరింది. తెలంగాణలోని పలు పట్టణాల్లో సిలిండర్ ధర రూ.1070కి పెరిగింది. సామాన్యుల వంట గ్యాస్ పెరుగుదలతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు