తెలంగాణ డీజీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. వయో పరిమితి విషయంలో నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.దీనిని పెంచాలని కోరుతూ తెలంగాణ డీజీపీ కార్యాలయం వద్ద నిరుద్యోగులు ఈరోజు ఆందోళనకు దిగారు. ఇది నిరుద్యోగులు, పోలీసుల మధ్య తోపులాటకు దారితీసింది. దీంతో డీజీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది.