నేపాల్‌లో అదృశ్యమైన విమానం..

 


నేపాల్‌లో అదృశ్యమైన విమానం కూలింది. 22 మంది ప్రయాణీకులతో పోఖారా నుంచి జోమ్‌సోమ్‌కు వెళ్తుండగా విమానం మిస్‌ అయింది.తారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ఏటీసీతో సంబంధాలు తెగిపోయినట్లు అధికారులు గుర్తించారు. అదృశ్యమైన ఫ్లైట్‌లో నలుగురు భారతీయులు, ముగ్గురు జపాన్ జాతీయులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అదృశ్యమైన విమానం కూలినట్లు, భారీ శబ్దాలు విన్నట్లు స్థానికులు వెల్లడించారు. విమానం మిస్ అయినట్లు చెప్పిన అధికారులు కూలిన విషయాన్ని మాత్రం అఫీషియల్‌గా వెల్లడించలేదు.