ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పీఎస్ గా వివేక్ కుమార్..

 


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  వ్యక్తిగత కార్యదర్శి (పీఎస్)గా ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి వివేక్ కుమార్ నియమితులయ్యారు.జాయింట్ సెక్రటరీ స్థాయిలో ప్రధాన మంత్రికి ప్రైవేట్ సెక్రటరీగా సేవలు అందించనున్నారు. ఈమేరకు శనివారం ఉత్తర్వులు వెలువడ్డాయి. వివేక్ కుమార్ ను మోదీకి పీఎస్ గా నియమించాలన్న ప్రతిపాదనకు కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది. వివేక్ కుమార్, ఐఎఫ్ఎస్ ను ప్రధానమంత్రి కార్యాలయంలో జాయింట్ సెక్రటరీ స్థాయిలో నియమించే ప్రతిపాదనకు కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది.