భారత రైల్వే లో బేబీ బెర్తులు..

 


ప్రయాణికులు తమ చిన్నారులతో సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు వీలుగా భారత రైల్వే బేబీ బెర్తులను అందుబాటులోకి తీసుకొచ్చింది.

పైలట్‌ ప్రాజెక్టులో భాగంగా లక్నో మెయిల్‌లో దిగువన ప్రధాన బెర్తుల వైపు మడత పెట్టగల బేబీ బెర్తులను ఏర్పాటుచేసింది.

ఏప్రిల్‌ 27న లక్నో మెయిల్‌లో రెండు చివర్లలోని క్యాబిన్లలో 60 ప్రధాన బెర్తులకు బేబీ బెర్తులను అమర్చినట్టు రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికుల స్పందనను బట్టి మిగతా రైళ్లలోనూ వీటిని ఏర్పాటుచేయనున్నట్టు పేర్కొన్నారు.