నేడు ప్రముఖులతో సీఎం కేసీఆర్ సమావేశం..

 


దేశవ్యాప్త పర్యటనలో భాగంగా ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్‌ శనివారం వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో భేటీకానున్నారు.


జాతీయ స్థాయిలో రాజకీయ పార్టీల నేతలు, ఆర్థికవేత్తలు, మీడియా సంస్థల ప్రముఖులు, రిటైర్డ్‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ అధికారులతో సమావేశమవుతారు. ఈ సందర్భంగా దేశ ఆర్థిక, రాజకీయ పరిస్థితులపై సీఎం కేసీఆర్ చర్చించనున్నారు. ఇక ఆదివారం సీఎం కేసీఆర్‌.. చండీగఢ్ వెళ్లనున్నారు. రైతు ఉద్యమంలో చనిపోయిన ఆరు వందల రైతుల కుటుంబాలను సీఎం పరామర్శిస్తారు. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌కు చెందిన రైతు కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తారు