బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ పై మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా...

 


తెలంగాణలో రాజకీయాలు (Telangana Politics) రసవత్తరంగా సాగుతున్నాయి. గత కొద్దిరోజులుగా టీఆర్ఎస్​ (TRS), బీజేపీలు (BJP) ఒకరిపై ఒకరు విమర్శలు , ప్రతి విమర్శలు చేసుకుంటూ ఉన్నారు.తాజాగా ఈ విమర్శలే కోర్టు గడప తొక్కే స్థాయికి చేరుకున్నాయి. బీజేపీ చీఫ్​ బండి సంజయ్‌ (Bandi Sanjay)పై మంత్రి కేటీఆర్ (Minister KTR) పరువు నష్టం దావా (defamation suit) వేశారు. ఈ మేరకు తన న్యాయవాది చేత బండి సంజయ్‌కి కేటీఆర్ నోటీసులు పంపించారు. మంత్రి కేటీఆర్ పాపులారిటీని దృష్టిలో ఉంచుకొని, ఆయనపై నిరాధారమైన ఆరోపణలు చేసి ప్రచారం పొందాలనే దురుద్దేశంతోనే బండి సంజయ్ అబద్ధాలు చెప్పారని నోటీసుల్లో న్యాయవాది (lawyer) పేర్కొన్నారు. అయితే దీనికి బండి సంజయ్ సమాధానమిచ్చారు. టీఆర్ఎస్ తాటాకు చప్పుళ్లకు భయపడబోమని సంజయ్ అన్నారు. తాను ప్రజల తరుఫు మాట్లాడుతున్నానని చెప్పారు. కాబట్టి ఎవరికీ బయపడే ప్రసక్తే లేదని తెలిపారు. తాను వాస్తవాలే మాట్లాడుతున్నానని అన్నారు. తెలంగాణ ఐటీ, మన్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ బండి సంజయ్ కు లీగల్ నోటీసులు పంపించారు. ఈ విషయంలో ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.


48 గంటల్లో క్షమాపణ చెప్పాలని..

ఒక జాతీయ స్థాయి పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న బండి సంజయ్ (Bandi Sanjay) ప్రజా జీవితంలో కనీస ప్రమాణాలు పాటించచలేదని నోటీసులో న్యాయవాది తెలిపారు . కేవలం ప్రచారం పొందాలన్న యావతో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల అంశాన్ని కేటీఆర్‌కు ఆపాదించే దురుద్దేశ పూర్వకమైన ప్రయత్నం చేశారని కేటీఆర్​ న్యాయవాది (KTR lawyer) పేర్కొన్నారు. కేటీఆర్ పరువుకు (KTR Prestige) భంగం కలిగించేలా, అసత్యపూరిత వ్యాఖ్యలు చేసిన సంజయ్.. సివిల్, క్రిమినల్ చట్టాల ప్రకారం కేటీఆర్‌కు పరిహారం చెల్లించాలని పేర్కొన్నారు. వీటితో పాటు చట్ట ప్రకారం తగిన చర్యలకు అర్హులవుతారని నోటీసుల్లో న్యాయవాది తెలిపారు. 48 గంటల్లో తన క్లైంట్ కేటీఆర్‌కు బేషరతుగా క్షమాపణ చెప్పాలని న్యాయవాది (Lawyer) నోటీసులో డిమాండ్ చేశారు.

తాటాకు చప్పళ్లకు భయపడే వ్యక్తిని కాదని..

దీనిపై స్పందించిన బండి.. లీగల్ నోటీసుల పేరుతో కేసీఆర్, కేటీఆర్ లు చేసే తాటాకు చప్పళ్లకు తాను భయపడే వ్యక్తిని కాదని బండి అన్నారు. నీకు నిజంగా ఇంటర్మీడియట్ విద్యార్థుల చావుకు కారణమైన గ్లోబరీనా సంస్థతో ఎలాంటి సంబంధమూ లేకపోతే.. ఈ వ్యవహారంలో ఐటీ శాఖ తప్పు లేదని అనుకుంటే.. సీబీఐ విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాయాలని అని సంజయ్ కేటీఆర్​కు​ సవాల్ చేశారు.

విద్యార్థులు చనిపోతే సీఎం కనీసం స్పందించలేదు..

ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బండి సంజయ్ చేస్తున్న పాదయాత్ర 30వ రోజు మహేశ్వరం నియోజకవర్గంలోని సిరిగిరిపురంకు చేరుకుంది. ఈ సందర్భంగా హెచ్ఎండీ పార్క్ సమీపంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 27 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోయారని బండి ఆరోపించారు. ఆ పాపం ఊరికే పోదని అన్నారు. పేద విద్యార్థులు చనిపోతే సీఎం కేసీఆర్ కనీసం స్పందించలేదని బండి అన్నారు. విద్యార్థులకు అన్యాయం జరిగిందని తల్లిదండ్రులు బాధను వ్యక్తం చేయడానికి వెళ్తే లాఠీఛార్జ్ చేయించారని తెలిపారు. తాను ఎవరికీ భయపడబోనని అన్నారు. తనపై ఐక్య రాజ్య సమితిలో నోటీసులు ఇచ్చినా పర్వాలేదని, కానీ గ్లోబరీనా సంస్థతో కేటీఆర్ కు ఉన్న సంబంధాలేమిటో ప్రజలకు చెప్పాలని బండి సంజయ్​ అన్నారు.