తారక్, ప్రశాంత్ నీల్ సినిమా లో కీలక పాత్రలో కమల్ హాసన్...?

 


తారక్ తన 30వ సినిమాను కొరటాల శివ  దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన ఈ సినిమాను సెట్స్ మీదకి త్వరలో తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ పాటికే మొదలవ్వాల్సిన ఎన్టీఆర్ 30ని..ఆచార్య ఫలితంతో మరోసారి పక్కాగా స్క్రిప్ట్ చూసుకొని ప్రారంభించాలని కొరటాల కాస్త సమయం తీసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. ఇక ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ఓ సినిమా కూడా మొదలవ్వాల్సి ఉంది. మైత్రీ మూవి మేకర్స్ ఎప్పుడో ఈ ప్రాజెక్ట్ గురించి కన్‌ఫర్మ్ చేశారు కూడా.


అయితే, తాజా సమాచారం మేరకు ఇందులో ఓ కీలకమైన పాత్ర ఉండగా, అందుకోసం దర్శకుడు ప్రశాంత్ నీల్   విశ్వనటుడు కమల్ హాసన్‌ ను ఎంపిక చేసుకోవాలనుకుంటున్నారట. ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వచ్చి చక్కర్లు కొడుతోంది. అసలు కమల్ - తారక్ కాంబినేషన్ అది కూడా ప్రశాంత్ నీల్ వంటి దర్శకుడు అనే ఆలోచనే అభిమానుల్లో టన్నులకొద్దీ ఉత్సాహాన్నిస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు గానీ, బిగ్ స్క్రీన్ మీద కమల్ హాసన్ - తారక్ కనిపిస్తే మాత్రం ఆ ఫీల్ మాటల్లో చెప్పడం ఎవరివల్లా కాదు. నిజంగానే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ 31 (NTR 31) కోసం కమల్‌ను సంప్రదించారా..ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా..? అనేది తెలియాల్సి ఉంది. అఫీషియల్‌గా ఈ కాంబో కన్‌ఫర్మ్ అయితే మాత్రం అంచనాలు తారా స్థాయిలోనే నెలకొంటాయనడంలో ఎటువంటి సందేహం లేదు.