చరణ్, శంకర్ సినిమా నుండి బిగ్ సర్ప్రైజ్..?

 


మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ , క్రేజీ దర్శకుడు శంకర్ ‌తో ఒక భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు శిరీష్ అత్యంత భారీ స్థాయిలో ఈ ప్రాజెక్ట్ ని నిర్మిస్తున్నారు. ఆ సంస్థలో ఇది 50వ చిత్రం అవడం విశేషం. RC 15 సినిమా పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్నట్టు ఇప్పటికే లీక్ అయిన ఫొటోస్ చూస్తే స్పష్టత వచ్చేస్తుంది. చరణ్ డ్యూయెల్ రోల్ చేస్తున్నట్టుగా ఇటీవల వైజాగ్ షెడ్యూల్ నుంచి లీకైన ఫొటోస్ అండ్ వీడియోస్ చూస్తే, ఆ క్లారిటీ కూడా వచ్చేసింది. ఒక పాత్రలో పవర్ ఫుల్ పొలిటికల్ లీడర్ గానూ, మరో పాత్రలో ఐఏఎస్ ఆఫీసర్ గానూ కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. గతంలో పంచకట్టులో చరణ్ సైకిల్ తొక్కుతున్న ఫోటో ఒకటి బయటకి వచ్చిన సంగతి తెలిసిందే. 


ఇదిలా వుంటే RC 15 సినిమాకి సంబంధించిన ఓ వార్త నెట్టింట సందడి చేస్తోంది. ఈ సినిమా స్టార్ట్ అయిన దగ్గరి నుంచి మెగా ఫ్యాన్స్ ఈ మూవీ టైటిల్ ఫస్ట్‌లుక్ పోస్టర్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, అతి త్వరలో RC 15 ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ ని కూడా దర్శకుడు శంకర్  రివీల్ చేయబోతున్నాడట. RC 15 నుంచి ఎప్పుడు పోస్టర్ అండ్ టైటిల్ బయటకి వచ్చినా అది ఫ్యాన్స్ పండగ చేసుకునేలా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. శంకర్ సినిమాకి, శంకర్ హీరోకి ఆ మ్యాజిక్ క్రియేట్ చేయడం కొత్తేమి కాదు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు