మహేష్, త్రివిక్రమ్ సినిమా లో నేను లేను --:తారకరత్న

 


సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.. మహేష్ కెరీర్ లో ఇది 28 వ సినిమా. గతంలో మహేష్ త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. థియేటర్స్ కంటే ఈ రెండు సినిమాలు టీవీలో విపరీతమైన ఆదరణ పొందాయి. ఇక ఇప్పుడు మహేష్ తో యాక్షన్ ఎంటర్టైనర్ ను తెరకెక్కిస్తున్నారట దర్శకుడు త్రివిక్రమ్. ఇటీవలే ఈ సినిమా పూజాకార్యక్రమాలు కూడా జరుపుకుంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను మొదలు పెట్టనున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. యాక్షన్ ఎంటటైనర్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో నందమూరి హీరో నటిస్తున్నాడని టాక్ నడుస్తుంది. మహేష్ సినిమాలో విలన్ గా నందమూరి తారకరత్న కనిపించనున్నారన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


ఈ మేరకు తారకరత్న పేరుమీద ఓ ట్వీట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీనిపై తారకరత్న స్పందిస్తూ.. ఆ వార్తల్లో వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చారు. తనకు ఎలాంటి ట్విట్టర్ ఖాతా లేదని, ఎవరో ఫేక్ ఖాతాలు తెరచి తన పేరుతో ట్వీట్స్ చేస్తున్నారని, అలాంటి వార్తల్ని నమ్మొద్దని హీరో నందమూరి తారకరత్న తెలియజేశారు. ఈ విషయంపై గతంలో కూడా ఆయన ఫేస్ బుక్ ఖాతా ద్వారా తెలిపారు. “నాకు సంబందించి ఏ విషయం అయిన నా పీఆర్ టీం నుంచి సమాచారం అందుతుంది. దయ చేసి ఫాల్స్ న్యూస్ స్ప్రెడ్ చేయొద్దు” అని నందమూరి తారకరత్న అన్నారు.