మంకీపాక్స్‌ వైరస్‌ను గుర్తించేందుకు పీసీఆర్‌ కిట్‌.

 


 మంకీపాక్స్‌ వైరస్‌ ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఇప్పటికే 20 దేశాలకు ఈ వైరస్‌ పాకింది. 200లకు పైగా కేసులు వెలుగుచూశాయి. మరో 100 అనుమానిత కేసులు నమోదయ్యాయి.


దీంతో ఈ వైరస్‌ గురించి ముమ్మర పరిశోధనలు మొదలయ్యాయి. ఈ పరిశోధనల్లో భారత్‌ కీలక పాత్ర పోషిస్తోంది.


దేశంలోని మెడికల్‌ పరికరాల తయారీ సంస్థ ట్రివిట్రాన్‌ హెల్త్‌కేర్‌.. మంకీపాక్స్‌ను గుర్తించేందుకు ఓ రియల్‌ టైమ్ పీసీఆర్‌ కిట్‌ను రూపొందించింది. ఫ్లోరోసెన్స్ ఆధారంగా ట్రివిట్రాన్‌ హెల్త్‌కేర్‌ సంస్థ ఆర్‌టీ-పీసీఆర్‌ కిట్‌ను డెవలప్‌ చేసింది. వన్‌ ట్యూబ్‌ సింగిల్‌ రియాక్షన్‌ ఫార్మాట్‌లో స్మాల్‌పాక్స్‌, మంకీపాక్స్‌ తేడాను గుర్తిస్తుంది.


దీనితో.. గంటలోనే రిజల్ట్ వచ్చేస్తోంది. ఈ కిట్‌తో టెస్టు చేసుకునేందుకు పొడి స్వాబ్‌లతో పాటు వీటీఎం స్వాబ్‌లను కూడా ఉపయోగించుకోవచ్చు. మంకీపాక్స్‌ అంతకంతకూ విస్తరిస్తోంది. బ్రిటన్‌, స్పెయిన్‌, పోర్చుగల్‌, కెనడా, అమెరికా సహా 20 దేశాల్లో కేసులు వెలుగుచూశాయి.


వ్యాధి వ్యాప్తిని అరికట్టకపోతే ఇతరులకు సోకే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని కేసులు బయటపడే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధి డాక్టర్‌ సైల్వై బ్రైండ్‌ అభిప్రాయపడ్డారు.