పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ఓ భారీ యాక్షన్ డ్రామా తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ 31వ సినిమాగా ఈ చిత్రం రాబోతుంది.
అయితే.. ఈ సినిమా ప్రారంభం కాకముందు నుంచే.. చాలా రూమర్స్ వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్ నివేదికల ప్రకారం, ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపికా పదుకునేను తీసుకునే ఆలోచనలో టీమ్ ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో విలన్ ను కూడా ఫిక్స్ చేశారట. ఇది ఇలా ఉండగా.. నేడు ఎన్టీఆర్ పుట్టిన రోజు. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ 31వ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఎన్టీఆర్ బర్త్ డే నేపథ్యంలోనే.. ఈ సినిమా నుంచి ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది మైత్రీ మూవీ మేకర్స్. ఇందులో ఎన్టీఆర్ చాలా క్రూరంగా కనిపిస్తున్నాడు. ఇక ఈ అప్డేట్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.