పిల్లల కోసం మోడీ PM కేర్స్ పథకం..

 


మానవాళి జీవితాన్ని కరోనాకి ముందు తర్వాతగా చెప్పుకోవచ్చు. రెండేళ్ల క్రితం వెలుగులోకి వచ్చిన కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా కల్లోలం సృష్టించింది. కోట్లాది మంది ప్రజలు కోవిడ్ కోరల్లో చిక్కుకుని శారీరకంగా, ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లక్షలాది మంది తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు. తమ ప్రియమైన కుటుంబ సభ్యులను, స్నేహితులను, హితులను కోల్పోయారు. మన దేశంలోనూ కరోనా బారిన పడి.. తల్లిదండ్రులను, తమ సంరక్షకులను ఎందరో పిల్లలు కోల్పోయారు. అనాథలుగా మారారు. అయితే ఇలాంటి బాధిత చిన్నారులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. తల్లిదండ్రులను అయినవారిని కోల్పోయి అనాథలుగా మారిన పిల్లలకు “ప్రధాన మంత్రిసహాయ నిధి”  నుంచి ప్రధాని మోడీ ఆర్ధిక సాయం అందించడానికి సంకల్పించారు. దీంతో నేటి  నుంచి కరోనా బాధిత చిన్నారులకు ఆర్థికంగా సహాయాన్ని అందించనున్నారు

ఈ పథకంలో భాగంగా.. 2020 మార్చి 11 నుంచి 2022 ఫిబ్రవరి 28 మధ్య కాలంలో కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను, సంరక్షుకులను, ఒంటరి తల్లి, తండ్రిని కోల్పోయిన పిల్లలకు పీఎం కేర్స్ నుంచి ఈ సహాయం అందించనున్నారు. PM కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్‌ను మే 29, 2021న ప్రారంభించారు. పాఠశాలకు వెళ్లే అర్హులైన పిల్లలకు స్కాలర్ షిప్స్, ఆయుష్మాన్ భారత్ – ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన కింద హెల్త్ కార్డ్‌లు, పీఎం కేర్ పాస్ బుక్స్ అందిస్తున్నారు.