ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు శనివారం వెలువడనున్నాయి. ఉదయం 11 గంటలకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్ ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ ఫలితాలను https://www.bse.ap.gov.in/ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు. ఈ ఏడాది ఏప్రిల్ 27 నుంచి మే 9వ తేదీ వరకు పదవ తరగతి పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. 6,21,799 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాశారు. కాగా, ఈసారి ఫలితాలను గ్రేడ్లకు బదులుగా మార్కుల రూపంలో ప్రకటించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలాఉంటే.. 2019 తరువాత కోవిడ్ కారణంగా రెండేళ్లు పరీక్షలు నిర్వహించని విషయం తెలిసిందే. ఆ రెండేళ్లు విద్యార్థులను హాజరు పర్సంటేజ్ ఆధారంగా పాస్ చేసింది. ఈసారి కరోనా ప్రభావం తగ్గడంతో.. రాష్ట్ర ప్రభుత్వం 10వ తరగతి పరీక్షలను యధావిధిగా నిర్వహించింది.