అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా మూడు రోజుల్లో దాదాపు 130 ఎఫ్ఐఆర్‌లు.620 మంది వరకు అరెస్ట్ అయ్యారు

 


గత కొన్ని రోజులుగా దేశం నిరసనల్లో అట్టుడుకుతోంది. దాదాపు 7 రాష్ట్రాల్లో యువత భారీ ఎత్తున ఆందోళనలు తెలుపుతోంది.

అగ్నిపథ్‌ పథకాన్ని రద్దు చేయాలని, పాత పద్దతిలోనే ఆర్మీ నియామకాలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ అల్లర్ల నేపథ్యంలో బీహార్ రాష్ట్రంలో గత మూడు రోజుల్లో దాదాపు 130 ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. అంతేకాకుండా 620 మంది వరకు అరెస్ట్ అయ్యారు. ఈ మేరకు బీహార్ ఏడీజీ(లా అండ్ ఆర్డర్) సంజయ్ సింగ్ శనివారం ప్రకటించారు.


'గత మూడు రోజుల్లో కేంద్ర పథకం అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా జరిగిన హింసాత్మక అల్లర్ల కారణంగా సుమారు 620 మంది అరెస్ట్ అయ్యారు. దాంతో పాటుగా రాష్ట్రంలో ఈ అల్లర్లకు సంబంధించి 130 ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. వచ్చిన నివేదిక ప్రకారం.. రైళ్లు, బస్సులు సహా పలు వాహనాలను నిరసనకారులు ధ్వంసం చేశారు. అంతేకాకుండా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అధికారులపై రాళ్ల దాడులు కూడా చేశారు' అని ఆయన తెలిపారు.