ఈ నెల 15 న హైదరబాద్ లో కాంగ్రెస్ అఖిలపక్ష సమావేశం--: రేవంత్ రెడ్డి..

 


హైదరాబాద్‌ లో శాంతి భద్రతలు క్షీణించాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 15 రోజుల్లో 8 మంది బాలికలపై అత్యాచారాలు జరిగాయని తెలిపారు.బాధితులకు కేసీఆర్‌ ప్రభుత్వం భరోసా ఇవ్వడం లేదని మండిపడ్డారు. గ్యాంగ్‌ రేప్‌ కేసులో ఎంఐఎం నేతల కుమారుల పాత్రపై ఎంపీ అసదుద్దీన్ ఎందుకు స్పందించడం లేదు? అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. 100 రోజుల్లో నేరస్తులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ను తొలగించాలన్నారు. 15న హైదరాబాద్ బచావో పేరిట అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని ప్రకటించారు. రైతు రచ్చబండ జూలై 7 వరకు పొడిగిస్తున్నామని రేవంత్‌రెడ్డి తెలిపారు.