ఈ నెల 19 నుండి 22వ తేదీ వరకు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం...

 


తెలంగాణలో రాబోయే ఐదు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి నల్లగొండ, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలతో పాటు నిజామాబాద్, మేడ్చల్  జిల్లాల్లో ఈ నెల 19న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.ఈ ప్రాంతాలతో పాటు మరిన్ని ఏరియాల్లో 22వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సంచాలకులు తెలిపారు. హైదరాబాద్ నగరంలో ఆకాశం మేఘావృతమై, సాధారణ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు