జులై 1 నుంచి ఉస్మానియా యూనివర్సిటీ ఎగ్జామ్స్ ప్రారంభం..

 


ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో జులై 1 నుంచి వివిధ డిగ్రీ కోర్సుల సెమిస్టర్‌ పరీక్షలు ప్రారంభం కానున్నట్లు కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్‌ శ్రీనగేష్‌ తెలిపారు. డిగ్రీ రెండో, నాలుగో, ఆరో సెమిస్టర్‌ రెగ్యులర్‌ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు పరీక్షలు జరగనున్నాయి. వీరితోపాటు అన్ని విభాగాల్లోని సెమిస్టర్‌ బ్యాక్‌లాగ్‌ పరీక్షలను కూడా నిర్వహించనున్నట్లు పరీక్షల విభాగం అధికారి తెలిపారి. పూర్తి వివరాలను ఓయూ అధికారిక వెబ్‌సైట్‌ https://www.osmania.ac.in/లో చెక్‌ చేసుకోవాలని విద్యార్థులకు ఈ సందర్భంగా సూచించారు.