పుష్ప 2 పై కేజీఎఫ్ ఎఫెక్ట్...

 


క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో అల్లు అర్జున్ మునుపెన్నడూ కనిపంచనంత ఊర మాస్ లుక్ లో కనిపించి మెప్పించాడు. బన్నీ సరసన రష్మిక మందన్న నటించిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కరోనా కల్లోలం తర్వాత విడుదలై సంచనలన విజయం అందుకుంది. ఇక ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కనుందన్న విషయం తెలిసిందే. మొదటి పార్ట్ భారీ విజయం అందుకోవడంతో ఇప్పుడు సెకండ్ పార్ట్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే మొదటి పార్ట్ కంటే సెంకడ్ పార్ట్ లో ఊహించని ట్విస్ట్ లు ఉండనున్నాయని తెలుస్తోంది. పుష్ప 2 కోసం సుకుమార్ పక్క ప్లాన్ రెడీ చేశారని తెలుస్తోంది.


‘పుష్ప 2’ ని మరిన్ని ప్రత్యేకతలతో మరింత స్పెషల్ గా తెరపైకి తీసుకురావాలని దర్శకుడు సుకుమార్ చూస్తున్నారు. గత నెల రోజులు గా సుకుమార్ ఈ సినిమా కథపై దృష్టిపెట్టారని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఇటీవల కేజీఎఫ్ 2 సినిమా దేశవ్యాప్తంగా సంచలన వసూళ్లను రాబట్టిన విషయం తెలిసిందే. పక్కా మాస్ హైఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన కేజీఎఫ్ 2 తో పుష్ప2 ప్లాన్ కంప్లీట్ గా మారిపోయిందని తెలుస్తోంది. బడ్జెట్ నుంచి సినిమాలోని కీలక ఘట్టాల వరకు అన్నింటిని భారీ స్థాయిలో మార్చేశారట. అలాగే ఈ మూవీ కోసం దాదాపు రూ. 400 కోట్లు కేటాయించబోతున్నట్టుగా టాక్ వినిపిస్తుంది. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభంకానుంది. ఈ సినిమా కథ పై కూడా చాలా వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.