రాష్ట్రంలో రెవెన్యూ జిల్లాలకు అనుగుణంగా ఏర్పాటైన 33 నూతన జిల్లా కోర్టులను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.
ఈ నెల 2న సాయంత్రం హైకోర్టులో జరుగనున్న ప్రత్యేక కార్యక్రమంలో ఎన్వీ రమణ, కేసీఆర్ 33 జ్యుడీషియల్ జిల్లాలను అధికారికంగా ప్రారంభిస్తారు. హైకోర్టుతో సంప్రదింపుల అనంతరం 33 జిలాల్ల కోర్టులను ఏర్పాటు చేస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ ఆవిర్భావం రోజైన జూన్ 2 నుంచి రాష్ట్రంలో నూతన జ్యుడీషియల్ జిల్లాలు ప్రారంభమవుతాయని పేర్కొంది.