ఛత్రపతి శివాజీ విగ్రహ స్థాపనకు కీ,శే॥ బగలికర్ రుక్మన రావు గారి జ్ఞాపకార్థంగా 51,300/- రూపాయల విరాళం- కుమారుడు బగలికర్ భగ్వాన్.

 సంగారెడ్డి జిల్లా, సదాశివపేట పట్టణంలో ఛత్రపతి శివాజీ విగ్రహ స్థాపనకు తమ వంతు బాధ్యతగా కీ,శే॥ బగలికర్ రుక్మన రావు గారి కుటుంబసభ్యులు తన తండ్రి యొక్క జ్ఞాపకార్థంగా యాభై ఒక్క వెయ్యి మూడు వంద రూపాయలను విరాళంగా ఛత్రపతి శివాజీ విగ్రహ నిర్మాణ కమిటీ సదాశివపేట వారికి హృదయపూర్వకంగా ఇచ్చి ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలకు కీ,శే॥ బగలికర్ రుక్మన రావు గారి కుటుంబ సభ్యులు ఎప్పుడూ ముందుంటామని మీడియా మిత్రుల సమక్షంలో తెలియజేశారు. ఇట్టి తరుణంలో ఛత్రపతి శివాజీ విగ్రహ నిర్మాణ కమిటీ సదాశివపేట వారు ఇలాంటి చరిత్రాత్మకంగా నిలిచే పనుల్లో భాగంగా పాలుపంచుకోవడం కీ,శే॥ బగలికర్ రుక్మన రావు గారి కుటుంబ సభ్యులను అభినందించదగ్గ విషయమని తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో కుటుంబ సభ్యులు బగలీకర్ భీమ్ రావ్ , బగలీకర్ అర్జున్ రావు, బగలీకర్ సుధాకర్ రావు,బగలీకర్ కృష్ణారావు , రాహుల్, రోహిత్, విశాల్, బంధుమిత్రులు మరియు ఛత్రపతి శివాజీ విగ్రహ నిర్మాణ కమిటీ సదాశివపేట సభ్యులు పాల్గొన్నారు.