భరిగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర...

 


ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు భారీ ఉపశమనాన్నిచ్చాయి చమురు కంపెనీలు. ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌ ధరలను భారీగా తగ్గించాయి. ఈ మేరకు జూన్ 1న సవరించిన ధరల వివరాలను వెల్లడించాయి. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేకపోయినప్పటికీ.. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలను భారీగా తగ్గించింది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. వాణిజ్య గ్యాస్ సిలిండర్లపై రూ.136 తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ధరలు నేటి నుంచే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. కాగా, దేశ రాజధాని ఢిల్లీలో సబ్సిడీ లేని 14.2 కేజీల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 999.5 గా ఉంది. ముంబైలోనూ గ్యాస్ సిలిండర్ ధర రూ. 999.5 గా ఉంది. కోల్‌కతాలో ధర రూ. 1026, చెన్నైలో 1015.50గా ఉంది.