రాజ్యసభ ఎన్నికల ఓటింగ్ ప్రారంభమైంది..

 


రాజ్యసభ ఎన్నికల ఓటింగ్ ప్రారంభమైంది. కేంద్ర ఎన్నికల సంఘం దేశంలోని 15 రాష్ట్రాల్లోని 57 స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన విషయం తెలిసిందే.

వాటిలో 41 స్థానాలు ఏకగ్రీవం కావడంతో నాలుగు రాష్ట్రాల్లో మిగిలిన 16 స్థానాలకు నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. త్వరలోనే రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ రాజ్యసభ ఎన్నికలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. నేడు మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్‌, హరియాణా రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.

మహారాష్ట్ర, రాజస్థాన్‌లో పోటీ బాగా ఉండనుంది. ఈ నేఫథ్యంలో ప్రధాన పార్టీలు తమ ఎమ్మెల్యేలను రిసార్టులకు కూడా తరలించాయి. ప్రత్యర్థి పార్టీలు తమ ఎమ్మెల్యేలను మభ్యపెట్టకుండా చర్యలు తీసుకున్నాయి. కాగా, అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 11 సీట్లు, ఆ తర్వాత మహారాష్ట్ర, తమిళనాడులో ఆరుగురి చొప్పున ఎంపీలను ఎన్నుకోనున్నారు. ఈ ఎన్నికల్లో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్‌, పీయూష్ గోయల్, కాంగ్రెస్ నేతలు రణ్‌దీప్ సుర్జేవాలా, జైరాం రమేశ్‌, శివసేన నేత సంజయ్ రౌత్ కూడా పోటీ చేస్తున్నారు.