ఛత్రపతి శివాజీ విగ్రహ స్థాపన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న- తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి న్యాయవాది కోవూరి సత్యనారాయణగౌడ్


సంగారెడ్డి జిల్లా: సదాశివపేట పట్టణంలో ఛత్రపతి శివాజీ విగ్రహ నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించబడిన ఛత్రపతి శివాజీ విగ్రహ స్థాపన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఛత్రపతి శివాజీ శోభాయాత్రలో పాల్గొన్న తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి న్యాయవాది కోవూరి సత్యనారాయణగౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో చెప్పుకోదగ్గ గర్వించదగ్గ అతిపెద్ద శివాజీ విగ్రహాన్ని సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో విగ్రహ ప్రతిష్టాపన చెయ్యడం చాలా గర్వించదగ్గ విషయమని అందుకు అహర్నిశలు కష్టపడ్డ ఛత్రపతి శివాజీ విగ్రహ నిర్మాణ కమిటీ సదాశివపేట వాసులకు మరియు అందుకు సహకరించిన దాతలకు ప్రత్యేకంగా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నానని తెలిపారు. ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న హిందూ బంధువులకు మరియు ఛత్రపతి శివాజీ అభిమానులకు ఛత్రపతి శివాజీ జీవన విధానం స్ఫూర్తి దాయకంగా భావించి ముందుకు నడవాలని ధర్మరక్షణకు భద్రతాభావానికి మారుపేరుగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో చరిత్రలో నిలిచే విధంగా ముందుండాలని అందరి బాధ్యతగా కర్తవ్యంగా ముందుకు నడవాలని విజ్ఞప్తి చేశారు. ఈ యొక్క ఛత్రపతి శివాజీ విగ్రహ స్థాపన మహోత్సవ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన దాతలు కల్లు గీత కార్మిక సంఘం సదాశివపేట పట్టణ పెద్దలు అధ్యక్షులు సీహెచ్ శ్రీనివాస్ గౌడ్ ఒక లక్ష పది వేల రూపాయలను , గౌరవ అధ్యక్షులు పిలిగుండ్ల రాములుగౌడ్ యాభై వేల రూపాయలను గౌడ కుల సంఘం తరపున విరాళం అందజేశారు, అదేవిధంగా చెన్న బసవేశ్వర సంఘం వారు యాభై వేల రూపాయలు, బగలికర్ భగ్వాన్ కుటుంబసభ్యులు యాభై వేల రూపాయలు , కౌన్సిలర్ పిల్లోడి విశ్వనాథంగారు యాభై వేల రూపాయలు, మరియు ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన అటువంటి పెద్దలు అందర్నీ అభినందించదగ్గ విషయమని , మనం చేసే ప్రతి మంచిపని చరిత్రలో చిరస్థాయి వరకు నిలుస్తుందని తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో ఛత్రపతి శివాజీ విగ్రహ నిర్మాణ కమిటీ మరియు హిందు బంధువులు , ఛత్రపతి శివాజీ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.