భారత్‌ రాష్ట్రీయ సమితిగా మారనున్న తెలంగాణా రాష్ట్ర సమితి..?.

 


 నేషనల్ పొలిటికల్ రాస్తాపైకి టీఆర్ఎస్ కారు వెళ్లనుంది. దేశ రాజకీయాల్లో స్టీరింగ్‌ తిప్పేందుకు గులాబీ బాస్‌ రెడీ అయ్యారు.జాతీయ పార్టీ ఏర్పాటుపై ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. జాతీయ రాజకీయాలపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఫోకస్ పెట్టారు. ఇవాళ సాయంత్రం కొందరు మంత్రులతో సమావేశం నిర్వహిస్తున్నారు.


జాతీయ పార్టీ ఏర్పాటుపై నిన్న మంత్రులు, పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ సుధీర్ఘంగా చర్చించారు. ఇవాళ కొందరు మంత్రులతో సమావేశం నిర్వహించి.. వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నారు. భారతీయ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ ఏర్పాటుపై మంత్రులతో కేసీఆర్ చర్చించనున్నారు. మంత్రుల నుంచి కేసీఆర్‌ ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోనున్నారు.

తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా నిలిచిన తెలంగాణ రాష్ట్ర సమితి పేరు త్వరలో భారత్‌ రాష్ట్రీయ సమితిగా మారనుంది. త్వరలో సీఎం కేసీఆర్ కొత్త పార్టీని ప్రకటించబోతున్నారు. దానికి భారత్‌ రాష్ట్రీయ సమితి అని పేరు పెట్టనున్నారు. దీనికి కారు గుర్తునే కొనసాగించాలని కేసీఆర్ భావిస్తున్నారు.


పార్టీ పేరు మార్పు, బైలాస్‌లో మార్పులపై విస్తృతస్థాయి సమావేశంలో చర్చించనున్నారు. దీనికి సంబంధించి ఎన్నికల సంఘంతో TRS ఇప్పటికే చర్చలు పూర్తి చేసింది. గులాబీ బాస్‌ ఆలోచనలు చూస్తుంటే TRS కాస్తా.. అతి త్వరలోనే BRSగా మారనుండటం ఖాయంగా కనిపిస్తోంది.