నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో విచారణను సోమవారానికి వాయిదా వేయాలని కోరిన రాహుల్ గాంధీ..

 

నేషనల్‌ హెరాల్డ్‌కు సంబంధించి మనీలాండింగ్‌ కేసులో ఈడీ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీని విచారిస్తున్నది. ఇప్పటికే మూడురోజుల పాటు కాంగ్రెస్‌ నేతను విచారించిన ఈడీ మరోసారి ఈ నెల 17న విచారణకు కావాలని సూచించింది.

అయితే, ఈ కేసు విచారణను సోమవారానికి వాయిదా వేయాలని ఈడీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం లేఖ రాశారు. ఇందులో సోనియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయాన్ని ప్రస్తావించారు. ఇదిలా ఉండగా.. రాహుల్‌పై ఈడీ విచారణకు వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ ఆందోళనలు చేస్తున్నది.