జూబ్లీహిల్స్ బాలికపై రేప్‌ కేసులో సీన్ రీకన్‌స్ట్రక్షన్‌ ముగిసింది.

 


బాలికపై రేప్‌ కేసులో సీన్ రీకన్‌స్ట్రక్షన్‌ ముగిసింది. జువైనల్ హోమ్ డ్రెస్ కోడ్‌తో క్రైమ్ సీన్‌కి నిందితులను పోలీసులు తీసుకెళ్లారు. కేబీఆర్ పార్క్, కాన్సు బేకరీ, పెద్దమ్మ తల్లి గుడి వెనుక భాగం, ఆమ్నిషియా పబ్ దగ్గర సీన్ రీకన్‌స్ట్రక్షన్‌ చేశారు. ఏ సీన్‌లో కూడా నిందితులను పోలీసులు కిందకు దించలేదు. నాలుగు ప్రాంతాల్లో సీన్ రీకన్‌స్ట్రక్షన్‌ ముగిసింది. సీన్ రీకన్‌స్ట్రక్షన్‌ తర్వాత జూబ్లీహిల్స్ పీఎస్‌లో సాదుద్దీన్‌తో పాటు మైనర్లను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో బాలిక మెడికల్ రిపోర్ట్ కీలకంగా మారింది. బాలిక శరీరంపై 12 గాయాలు ఉన్నట్లు మెడికల్ రిపోర్ట్‌లో వైద్యులు తెలిపారు.