రేపు ఢిల్లీలో సీఎం జగన్ పర్యటన..

 


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రేపు గురువారం ఢిల్లీలో పర్యటించనున్నారు.రేపు ఉదయం 11-30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయలుదేరి వెళతారు.మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీ చేరుకుని అక్కడ నుంచి వన్ జన్‌ఫథ్ కు చేరుకుంటారు. ఆయన అక్కడ రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులు,పోలవరానికి నిధులు తదితర అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించే అవకాశం ఉంది.